Homeసినిమా'Memorable day'..

‘Memorable day’..

పుష్ప– ది రైజ్ మూవీకి గానూ జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తన ఆనందాన్ని ఫ్యాన్స్​తో పంచుకుంటూ సోషల్​ మీడియాలో వరుసగా పోస్ట్​లు చేశారు. జాతీయ అవార్డు అందుకున్న రోజు మెమెరబుల్ డే అని, ఆ మూమెంట్స్ బ్యూటిఫుల్​ అంటూ అల్లు అర్జున్ పోస్ట్ షేర్ చేశాడు. తన భార్య, తల్లిదండ్రులతో ఈ ఆనందాన్ని షేర్ చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్​లోడ్ చేశాడు. బన్నీ పోస్ట్​ చూసిన ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమ అభిమాన హీరోకు మరోసారి కంగ్రాట్స్ చెబుతున్నాయి. అయితే, మంగళవారం జాతీయ అవార్డుల కార్యక్రమం జరగగా..

ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న​ అనంతరం అల్లు అర్జున్ తన సోషల్ అకౌంట్లలో ఓ ఎమోషనల్​ పోస్ట్​ పెట్టారు. తన విజయానికి దర్శకుడు సుకుమార్ కారణమని చెప్పారు. ‘జాతీయ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నా. నాకు ఇంత గొప్ప గుర్తింపునిచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నేను సాధించిన మైలురాయి మాత్రమే కాదు.. మన సినిమాను ఆదరిస్తూ.. సపోర్ట్‌ చేసినవారందరికీ చెందుతుంది. అలాగే దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. నా విజయానికి ఆయనే కారణం’ అని బన్నీ పోస్ట్‌ చేశారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img