ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీలోని అందరిని అల్లు అర్జున్ కలుస్తున్నాడు. అదే క్రమంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవిని, నాగబాబుని ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ కలిసాడు. తాజాగా పవన్ కళ్యాణ్‌ని కూడా అల్లుఅర్జున్ ఈరోజు కలవబోతున్నాడు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాద్ రానున్నారు. అయితే అల్లు అర్జున్ అల్లు పవన్ కళ్యాణ్ నేడు కలవబోతున్నాడు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ రానున్నారు. అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి కలిసే అవకాశం ఉంది. ఈ తరుణంలో గత కొన్ని రోజులుగా ఇరు కుటుంబాల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది.