Allu Arjun : ”పుష్ప 2” వంటి పాన్ ఇండియా హిట్టు తరువాత ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ (Allu Arjun)త్రివిక్రమ్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అని ప్రకటించారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటివరుకు వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. అయితే ఇంతలో ఈ సినిమా క్యాన్సిల్ అయింది అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు అట్లీ ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ అట్లీ ఇప్పటివరకు ఒక ప్లాప్ కూడా లేకుండా సినిమాలు చేసాడు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమా తీసాడు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది.ఈ నేపథ్యంలోనే తాజాగా అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున సినిమా చేయబోతున్నాడు అని వినికిడి. అయితే త్రివిక్రమ్ సినిమా ఇంకా స్క్రిప్ట్ వర్క్ దశలో ఉండగానే అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని తెలుస్తుంది. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న సినిమా పూర్తి చేసిన తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.