Homeహైదరాబాద్latest Newsపవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ ట్వీట్.. ! ఒకటి కానున్న మెగా-అల్లు ఫ్యామిలీ..?

పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ ట్వీట్.. ! ఒకటి కానున్న మెగా-అల్లు ఫ్యామిలీ..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‏గా నటించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో..ఈ సినిమా టిక్కెట్‌ ధరల విషయమై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ టిక్కెట్ పెంపునకు అనుమతినిచ్చారు. టిక్కెట్ పెంపును ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల, శ్రేయస్సు పట్ల మీ దృఢ నిబద్ధతను తెలియజేస్తోందని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు అల్లుఅర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.దీంతో మెగా vs అల్లు వివాదానికి బన్నీ ముగింపు పలికినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాతోనే అయినా మెగా-అల్లు ఫ్యామిలీ ఒకటి అవుతాయి ఏమో అని చూడాలి.

Recent

- Advertisment -spot_img