ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయినిగా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం పలు ప్రధాన నగరాలకు వెళ్లి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తాజాగా ఈ ‘పుష్ప-2’ సినిమా ప్రమోషన్ ముంబైలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అల్లుఅర్జున్, రష్మిక మందన హాజరుయ్యారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో రష్మికతో కలిసి అల్లుఅర్జున్ అదిరిపోయే స్టెప్పులేశారు.