Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ ఇంటికి సినీ ప్ర‌ముఖులు..! మరి మెగా హీరోలు ఎక్కడ..?

అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్ర‌ముఖులు..! మరి మెగా హీరోలు ఎక్కడ..?

‘పుష్ప 2’ సినిమా సందర్భంగా చిక్కడపల్లి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను నిన్న పోలీసుల అరెస్ట్ చేసారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటులు ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో మెగా ఫామిలీ మాత్రం ఎక్కడ కనిపించలేదు. కేవలం నిన్న మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు మాత్రం అల్లుఅర్జున్ ఇంటికి వెళ్లారు. అయితే ఈ రోజు అల్లు అర్జున్ జైలు విడుదలైన ఇంకా మెగా ఫామిలీ మాత్రం అల్లు ఇంటికి వెళ్ళలేదు.. అలాగే ఈ ఘటన పై సోషల్ మీడియాలో ఎక్కడా స్పందించలేదు. మెగా హీరోలు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ వీరు ఎవరు ఇప్పటివరకు ఎక్కడ స్పందించకపోవడం గమనార్హం. గత కొద్ది రోజులుగా అల్లు ఫామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య సఖ్యత లేదు. సోషల్ మీడియా వేదికగా ఇరువర్గాల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా హీరోలు అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించలేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయా అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Recent

- Advertisment -spot_img