నార్నే నితిన్ హీరోగా అంజి కె.మణిపుత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆయ్’. ఆగస్టు 15న విడుదలకానుంది. ఈనేపథ్యంలో అల్లుఅర్జున్ మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘‘నాకెంతో ఇష్టమైన బన్నీ వాసు, నా సోదరి విద్యకు ఆల్ ది బెస్ట్. ‘గీతా ఆర్ట్స్2’లో భాగమైన ఆయ్ సినిమా కుటుంబసభ్యులందరికీ ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నా’’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.