నటి అమలాపాల్ లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నది. తన ఫ్రెండ్ జగత్ దేశాయ్ పెళ్లి ప్రపోజల్‌కు ఆమె ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను జగత్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. ‘నా కలల రాణి నాకు ఎస్ చెప్పింది’అంటూ #Weddingbells హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశాడు. గురువారం అమలాపాల్ బర్త్ డే కావడంతో అతడు ఈ వీడియోను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. కేరళకు చెందిన అమలాపాల్ మలయాళీ సినిమాలతో వెండితెరకు పరిచయమయ్యారు. ‘బెజవాడ’తో ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ‘లవ్ ఫెయిల్యూర్’, ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘జెండా పై కపిరాజు’ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కెరీర్‌లో దూసుకెళ్తోన్న సమయంలో దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారు. పరస్పర అంగీకారంతో 2017లో వీరిద్దరూ విడిపోయారు.