ప్రముఖ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ వినూత్న సేవను ప్రారంభించనుంది. ‘డైరెక్ట్ టూ డివైజ్(డీ2డీ)’ సాంకేతికతను పరీక్షిస్తున్న ఈ సంస్థ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. దీని సాయంతో యూజర్లు సిమ్ కార్డు లేకుండా, మొబైల్ నెట్వర్క్ లేకపోయినా కాల్స్, మెసేజ్లు చేసుకోవచ్చు. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్ కంపెనీ వయాశాట్తో కలిసి BSNL దీనిని అభివృద్ధి చేసింది. దీని కోసం అంతరిక్షంలోని ఉపగ్రహాలు మొబైల్ టవర్లలా ఉపయోగపడతాయి.