ఉసిరి చెట్టు అందించే ఆకులు, కాయలు, కాండం ప్రతిదానికి ఆయుర్వేదంలో మంచి ప్రాముఖ్యత ఉంది. పరిగడపున ఉసిరిని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బుల లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలుంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.