సంగారెడ్డి జిల్లా మనోహరాబాద్‌కు చెందిన బ్రహ్మచారి, నారాయణఖేడ్‌కు చెందిన గుండు శివకుమార్ రావి ఆకులపై రాములోరి చిత్రాలు మలిచి తమ భక్తిని చాటుకున్నారు. అయోధ్యలోని బాలరాముడు, పట్టాభిరామయ్య చిత్రాలను స్ఫురించేలా చేసి రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. నేడు శ్రీరామనవమిని పురస్కరించుకుని రాష్ట్రంలోని సీతారామ, హనుమాన్ ఆలయాలు రామ నామ స్మరణతో మారుమోగుతున్నాయి.