ప్రస్తుతం దేశంలో క్విక్ కామర్స్ దూకుడు కొనసాగుతోంది. ఈ క్రమంలో పోటీని తట్టుకోవడానికి అమెజాన్ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కస్టమర్లను ఆకర్షించడానికి ఫాస్ట్ డెలివరీ సేవలను అందించడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో 15 నిమిషాల డెలివరీ సేవ కోసం ట్రయల్ రన్ను ప్రారంభించింది. ఇప్పటికైతే ఈ సర్వీస్ను బెంగళూరులో ప్రారంభించగా రాబోయే నెలల్లో పూర్తి స్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది.