Amazon Prime Price : పిరం కాబోతున్న అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్..
Amazon Prime Price – అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అకౌంట్ చాలా కాస్ట్‌లీ కాబోతోంది.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కోసం సంవత్సరానికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మెంబర్‌షిప్ ద్వారా అమెజాన్‌లో ఏవైనా వస్తువులు తీసుకుంటే.. ఫాస్ట్ డెలివరీ, ప్రైమ్ మూవీస్ యాక్సెస్, ప్రైమ్ మ్యూజిక్ యాక్సెస్ ఉంటుంది.
పాస్‌పోర్ట్ కవర్ ఆర్డర్ చేస్తే ఒరిజినల్ పాస్‌పోర్ట్ నే పంపిన అమెజాన్…
ఈ ఫీచర్లన్నింటి యాక్సెస్ కావాలంటే ప్రస్తుతం కేవలం రూ.999 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
కానీ.. డిసెంబర్ 13 తర్వాత అంటే డిసెంబర్ 14 నుంచి మాత్రం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కాస్ట్‌లీ కానుంది.
డిసెంబర్ 14 నుంచి ప్రైమ్ మెంబర్‌షిప్ ధరలు పెంచుతున్నట్టు అమెజాన్ సంస్థ ఇటీవలే ప్రకటించింది.
మీ ఎముకల ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నారా
డిసెంబర్ 14 నుంచి ఏడాదికి మెంబర్‌షిప్ తీసుకుంటే రూ.500 ఎక్కువగా చెల్లించాలి. అంటే.. రూ.1499 చెల్లించాలన్నమాట.
నెలవారి ప్లాన్ తీసుకుంటే రూ.129 బదులు రూ.179 చెల్లించాల్సి ఉంటుంది.
మూడు నెలల ప్లాన్ తీసుకుంటే.. రూ.329 బదులు రూ.459 చెల్లించాలి.
ఇది కేవలం కొత్త ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే. పాత మెంబర్స్‌కు పాత ప్లానే ఉంటుంది.
ఒకసారి వాళ్ల ప్లాన్ వాలిడిటీ ముగిశాక.. కొత్త ప్లాన్ ప్రకారం మెంబర్‌షిప్‌ను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.