ఇదే నిజం, బెల్లంపల్లి : కాశిపేట మండలంలోని దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఆవరణలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘుపతిరావు జ్ఞాపకార్ధంగా ఏర్పాటుచేసిన ఉచిత అంబలి పంపిణీ ముగిసింది. ప్రజా సంక్షేమం కోసమే ఆనాడు రఘుపతిరావు తాపత్రయపడేవారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ అన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రెండు నెలలు పాటు ఉచితంగా అంబలి పంపిణీ చేయడం అభినందనీయమని, ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.