Ambani : వేసవి ప్రారంభం అంటే కేవలం వేడి వాతావరణం కాదు, విద్యుత్ బిల్లులు పెరిగే సమయం కూడా చాలా భారతీయ కుటుంబాలు వేసవిలో విద్యుత్ బిల్లు కొంచం ఎక్కువగా చెలిస్తారు. ఎందుకంటే వేసవిలో ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు మొదలైన వాటి వినియోగం పెరుగుతుంది కాబట్టి కట్టాల్సి వస్తుంది. ఈ క్రమంలో సామాన్యులకు కరెంటు బిల్లులు వందల లేక వేలల్లోనే వస్తుంటాయి. కానీ ఒక ఇంటికి మాత్రం రూ.70 లక్షల విద్యుత్ బిల్లు వచ్చింది. అయితే ఇది ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా పేరుగాంచింది.
ముంబయిలోని ముఖేష్ అంబానీ నివాసం ‘అంటిలియా’.. దీని నిర్మాణానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. 27 అంతస్తుల భవనం నిర్మాణం 2005 లో ప్రారంభమై 2010 నాటికి పూర్తయింది. దీనిని 16,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో నిర్మించారు. బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసం ఇది. కేవలం ఒక నెలలోనే, అంబానీ ఇంటి కరెంటు బిల్లు రూ. 70,69,488 వచ్చింది. ఈ డబ్బుతో మీరు ముంబైలో కొత్త ఫ్లాట్ కొనవచ్చు. ఆంటిలియా కేవలం ఒక ఇల్లు కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఆంటిలియాపై మూడు హెలిప్యాడ్‌లు నిర్మించబడ్డాయి. 168 కార్లను నిలిపే బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలం. లగ్జరీ స్పాలు, ఆరోగ్య కేంద్రాలు, వేడి మరియు చల్లటి నీటి ఈత కొలనులు, దేవాలయాలు ఉన్నాయి. అమెరికన్ ఆర్కిటెక్చర్ సంస్థ పెర్కిన్స్ & విల్ దీన్ని నిర్మించింది.