రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. రాధికా మర్చంట్‌తో జులై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో సంప్రదాయ హిందూ వైవాహిక పద్ధతిలో వివాహం జరగనుంది. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అంబానీ ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వెడ్డింగ్ కార్డ్స్ మాత్రం వైరల్‌గా మారాయి. జులై 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు గ్రాండ్‌గా వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి.