HomeరాజకీయాలుAmbati had a bitter experience in Khammam అంబటికి ఖమ్మంలో చేదు అనుభవం

Ambati had a bitter experience in Khammam అంబటికి ఖమ్మంలో చేదు అనుభవం

– ఓ ఫంక్షన్​కు వచ్చిన ఆయనకు టీడీపీ నేతల నుంచి నిరసన సెగ

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఖమ్మంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ నిరసన సెగ తగిలింది. ఓ ఫంక్షన్​ హాజరయ్యేందుకు మంత్రి ఖమ్మం నగరానికి రాగా.. శుక్రవారం ఉదయం ఆయన బస చేసిన ఓ హోటల్‌ ఎదుట టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. మంత్రి హోటల్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారంటూ కార్యకర్తలు ప్రశ్నించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేసుకోవాలి గానీ.. వ్యక్తిగత దూషణలు సరికాదన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి.. టీడీపీ కార్యకర్తలపైకి దురుసుగా దూసుకువచ్చారు. కార్యకర్తలు కూడా దురుసుగా మంత్రి మీదకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img