Homeహైదరాబాద్latest Newsమళ్లీ వైసీపీలోకి అంబటి రాయుడు..?

మళ్లీ వైసీపీలోకి అంబటి రాయుడు..?

మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ వైసీపీలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది డిసెంబర్‌లో వైసీపీలో చేరిన అంబటి రాయుడు.. జనవరి 7న రాజీనామా చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. బుధవారం నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇలాంటి సమయంలో అంబటి రాయుడు బుధవారం వేకువజామున 3 గంటల సమయంలో ”సిద్ధం” అంటూ ఒక పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో అంబటి రాయుడు పొలిటికల్ కెరీర్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఈ ట్వీట్‌తో అంబటి రాయుడు తిరిగి వైసీపీలో చేరతారనే ప్రచారం మొదలైంది. తాజాగా అంబటి రాయుడు మళ్ళీ వైసీపీలో చేరతారనే సంకేతాలు వస్తున్నాయి. ఆయన వైసీపీలో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అయ్యారని..అందుకే ఈ ట్వీట్ చేశారని తెలుస్తోంది. ఆయన వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. బుధవారం నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇలాంటి సమయంలోనే అంబటి పోస్ట్ పెట్టడం చర్చకు దారి తీసింది.

Recent

- Advertisment -spot_img