ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో అంబేద్కర్ కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు కొత్త కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా చిలుమూల లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా మొలుగురి రమేష్, జంజిరికానీ భారత్, ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, క్యాషియర్ గంధం రమేష్, సంయుక్త కార్యదర్శి కుంటాల రాజమల్లయ్య, పసుల భూచన్న, ప్రచార కార్యదర్శి దేవి అంజి, కార్యవర్గ సభ్యులు నేతుల రవీందర్ గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పారుపల్లి రాజమల్లయ్య, రాగుల కాంతయ్య, దాసరి పురుషోత్తం, వెలుగు గంగాధర్, అరికెల సతీష్ , కట్ట భువనేశ్వర్, దుర్గం రాజన్న, చందులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.