తెలంగాణ ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ప్రమాదాలు జరిగినప్పుడు 108 అంబులెన్సులు ఎనిమిది నిమిషాల్లోనే బాధితుల వద్దకు చేరుకునేలా ప్రభుత్వం కొత్త వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని కోసం అంబులెన్సుల సంఖ్యను పెంచనున్నట్లు సమాచారం. హైవేలపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలకు దగ్గరగా అంబులెన్సులను మోహరించాలని ప్రభుత్వం యోచిస్తోందట.