America : అమెరికాలోని (America) వాషింగ్టన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 64 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు అమెరికా ప్రకటించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో రీగన్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఒక విమానం, హెలికాఫ్టర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో విమానం, హెలికాఫ్టర్ రెండూ ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. మిలిటరీ హెలికాప్టర్‌ను ఢీకొన్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఉన్న వారందరూ మరణించినట్లు భావించినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. మృతదేహాల కోసం వెలికితీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.