రఫాపై ఇజ్రాయెల్ దాడిని అమెరికా ఖండించింది. సామాన్య ప్రజలకు హాని కలగకుండా చూసుకోవాలని కోరింది. ‘ సంఘటనా స్థలంలోని దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. గెండె తరుక్కుపోతోంది. హమాస్ కు బుద్ధి చెప్పేందుకు ఇజ్రాయెల్‌కు హక్కు ఉంది. కానీ సామాన్య ప్రజలకు ఇబ్బందులు తలెత్తకూడదు’ అని వైట్ హౌస్‌లోని జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక సమాచార విభాగం కో ఆర్డినేటర్ జాన్ కిర్బీ అన్నారు.