Homeఅంతర్జాతీయంఅమెరికా, ర‌ష్యా సైనిక ఉద్రిక్త‌లు ఎవ‌రి ల‌బ్ధి కోసం?

అమెరికా, ర‌ష్యా సైనిక ఉద్రిక్త‌లు ఎవ‌రి ల‌బ్ధి కోసం?

అమెరికా, ర‌ష్యా దేశాల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. రెండు దేశాలు సైనికులు ఒక వారం వ్య‌వ‌ధిలో రెండు సార్లు ముఖాముఖీ త‌ల‌ప‌డ్డంత ప‌ని చేశారు. ఈ రెండు సార్లు కూడా ర‌ష్యా ద‌ళాలే దూకుడుగా స్పందించడం ప‌లు అనుమానాల‌ను రెకేత్తిస్తోంది. అమెరికా ఎన్నిక‌లు జ‌రుగుతున్న ఈ స‌మ‌యంలో ర‌ష్యాతో ఉద్రిక్త‌లు అమెరికా ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపనున్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ట్రంప్ విజ‌యానికి ర‌ష్యా గూఢాచార సంస్థ స‌హాయం చేసింద‌ని ఆరోప‌ణ‌లు ద‌రిమిలా ఈసారి కూడా అదే విధంగా ఏదో జ‌రుగ‌బోతున్న‌ట్లు భావిస్తున్నారు.
అస‌లేం జ‌రిగిందంటే..
ఐరోపాలోని న‌ల్ల స‌ముద్రం గ‌గ‌న‌త‌లంలో ఇటీవ‌ల‌ అమెరికా బాంబ‌ర్ బీ-52 ప్ర‌యాణించే స‌మ‌యంలో ర‌ష్యాకు చెందిన జెట్ ఫైట‌ర్ ఒక‌టి స‌మీపంలోకి రావ‌డంతో పాటు ప‌లుసార్లు ముందు నుంచి వెళ్లింద‌ని, ఇది మ‌మ్మూటికీ అంత‌ర్జాతీయ విమాన నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని ఐరోపాలోని అమెరికా ఎయిర్‌ఫోర్స్ క‌మాండ‌ర్ జెఫ్ హారిగ్రెయిన్ వెల్ల‌డించారు. అదే విధంగా తూర్పు సిరియాలో ఆగ‌స్టు 25న‌ అమెరికా, ర‌ష్యా సైనికుల వాహ‌నాలు ఒకే వ‌రుస‌లో ప్ర‌యాణిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ర‌ష్యాకు చెందిన వాహ‌నం ఒక‌టి ఉద్దేశ‌పూర్వ‌కంగా అమెరికా వాహ‌నాన్ని ఢీ కొట్టింది. అ స‌మ‌యంలో ర‌ష్యాకు చెందిన సైనిక హెలికాఫ్ట‌ర్లు అమెరికా వాహ‌నాల స‌మీపంలోకి రావ‌డం ఉద్రిక్త‌ను మ‌రింత పెంచింది. ఈ ఘ‌ట‌న‌లో అమెరికా సైనికులు గామ‌ప‌డ్డ‌ట్లు ఆ దేశ సైనికాధికారులు వెల్ల‌డించారు. అమెరికా సైనికుల‌దే త‌ప్ప‌ని ర‌ష్యా వాదించింది. సిరియాలో రెండు వేర్వేరు వ‌ర్గాల‌కు అమెరికా, ర‌ష్యా మ‌ద్దుతు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img