HomeతెలంగాణAmit Shah:అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారు

Amit Shah:అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారు

అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారు

  • ఎల్లుండి హైదరాబాద్ కు షా
  • మేధావులు, ఉద్యమకారులు, కవులతో భేటీ

ఇదేనిజం, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలో పర్యటించనున్నారు. గతంలో ఖమ్మం బహిరంగసభలో ఆయన పాల్గొనాల్సి ఉండగా చివరి నిమిషంలో రద్దైన విషయం తెలిసిందే. దీంతో తాజాగా అమిత్ షా పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్‌ షా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సామాజిక సంఘాల నాయకులతో భేటీ కానున్నారు. తరువాత సాయంత్రం 5:15 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌కు రానున్నారు.

Recent

- Advertisment -spot_img