Homeహైదరాబాద్latest NewsAmit Shah: రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించండి..

Amit Shah: రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించండి..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సిద్దిపేటలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్‌లో పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కనీసం 12 లోక్‌సభ స్థానాలలో బీజేపీ గెలిపించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అలాగే అయోధ్యలో రామమందిరం కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేశారని అన్నారు. కాశ్మీర్‌ను భారత్‌లో శాఅంతర్భాగం చేసేందుకు మోదీ ఎంతో చేశారన్నారు. తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని అయన ఆరోపించారు. బీజేపీ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img