Homeహైదరాబాద్latest Newsఅమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు.. ఢిల్లీ నుంచి మరో ఐపీఎస్ అధికారి..!

అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు.. ఢిల్లీ నుంచి మరో ఐపీఎస్ అధికారి..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. ఢిల్లీ పోలీసుల బృందం నిన్నటి నుంచి హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తోంది. మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మార్ఫింగ్ కేసులో భాగంగా ఐదుగురు సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన ఐదుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రాత్రంతా విచారించారు. ఫేక్‌ వీడియోకు సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img