బీజేపీ ఇప్పటివరకూ 17 స్థానాలు గెలుచుకుంది. 217 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తంగా 234 స్థానాల్లో బీజీపీ లీడ్‌లో ఉంది. సొంతంగా అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 38 సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే తాజా అంశాలపై చర్చించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. 400 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీకి ఆశించినన్ని సీట్లు వచ్చేలా లేవు. 2014 ఎన్నికల్లో 284 సీట్లు సాధించింది. 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకుంది. కానీ ఈ సారి మాత్రం అధికారం చేపట్టే అవకాశం ఉన్నా బీజేపీ సీట్లు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది.