Homeజిల్లా వార్తలుఅమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి : శ్రీ పాతుల మనోహర్

అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలి : శ్రీ పాతుల మనోహర్

ఇదే నిజం, గొల్లపల్లి : రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీనవర్గాల ఆశా జ్యోతి డా”బి.ఆర్ అంబేడ్కర్ పై కేంద్ర హెూం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎన్ఎస్ యూఐ ధర్మపురి నియోజకవర్గం ఉపాధ్యక్షులు శ్రీ పాతుల మనోహర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ అధించిన రిజర్వేషన్ ఫలాలను పొంది, అంబేడ్కర్ కల్పించిన ఓటు హక్కు తో నేడు కేంద్ర హెూమ్ శాఖ మంత్రి గా పదవి స్వీకరించి ఆ మహానీయున్ని పార్లమెంట్ సాక్షిగా కించ పరుస్తూ మాట్లాడటం సరి కాదని తక్షణమే అమిత్ షా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని ఎన్ఎస్ యూఐ శ్రీ పాతుల మనోహర్ డిమాండ్ చేశారు. ఈమధ్య అంబేద్కర్” అంబేద్కర్” అంబేద్కర్” అనడం ఫ్యాషన్ గా మారింది. వాళ్లు అన్నిసార్లు అలా అనడం కంటే దేవుడి పేరునుస్మరిస్తే స్వర్గంలో స్థానం దక్కుతుంది అని అమిత్ షా వ్యాఖ్యానించడం నిరంకుశపాలనకు నిదర్శనం. ప్రపంచ దేశాలకు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆదర్శ ప్రాయులు. ఆయన్ని చులకన గా మాట్లాడితే. అంబేడ్కర్ వాదులు,దేశ ప్రజలు సహించ బోరు అని ఆయన అన్నారు.

Recent

- Advertisment -spot_img