దేశంలో రైళ్లు తగినంతగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రెళ్లు పెంచాలని ఎన్నోసార్లు విజ్నప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని వినూత్నంగా ఆలోచించింది. ప్రయాణికులతో కిక్కిరిసిన రైలు ఫొటోను అమితాబ్ బచ్చన్ ఫొటోతో యాడ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేసింది. ‘బచ్చన్ జీ దేశంలో రైల్లు తగినంతగా లేవు. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మేం ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సెలబ్రిటీలు చెప్తే వాళ్లు వింటారు. సమస్య పరిష్కారం అవుతుంది’అంటూ విమర్శించింది.