ముంబయి బిల్‌బోర్డు ఘటన చర్చనీయాంశంగా మారింది. ఎనిమిదేళ్ల క్రితమే ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్ హోర్డింగ్‌లపై హెచ్చరించినట్లు తెలిపాడు. ‘అక్రమ నిర్మాణాల్లో చాలావాటికి మెటల్ షీట్లతో చేసిన కప్పులే ఉన్నాయి. బలమైన గాలుల వల్ల వేలాది బిల్‌బోర్డులతో ప్రమాదం ఉంది’ అని తెలిపాడు. భారీ సైజులో ఉన్న బిల్‌బోర్డు పక్కే ఉన్న పెట్రోల్ బంకుపై కుప్పకూలింది. వందమందికి పైగా చిక్కుకున్నారు. ఇప్పటివరకూ 14 మంది మృతదేహాలను వెలికితీశారు.