ఇటలీకి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు చాలా ధనవంతురాలు.. ఆమెకు భర్త, పిల్లలు లేరు. తన బాగోగులు చూసేందుకు ఓ కేర్‌టేకర్‌ను పెట్టుకుంది. ఆస్తికి వారసులు లేరు.. కానీ ఆమెకు చాలా మంది మేనల్లుళ్ళు ఉన్నారు. అయితే గత నవంబర్‌లో ఆమె 80 ఏళ్ల వయసులో మరణించింది. దీంతో ఆ వృద్ధురాలి ఆస్తిని తన మేనల్లుళ్లు, కోడళ్ల పేర్ల మీద రాసేస్తుందని అందరూ భావించారు.
అయితే వృద్ధ మహిళ తన ఆస్తి మొత్తం కేర్ టేకర్ కు రాసి ఇవ్వడంతో ఆమె బంధువులు షాక్‌కు గురయ్యారు. దీంతో ఆ వృద్దురాలి మేనల్లుడు కోర్టు మెట్లెక్కాడు. ఆడిట్ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం మహిళకు ఎటువంటి వారసులు లేరు.. కనుక ఆమె మొత్తం $5.4 మిలియన్లు అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 45 కోట్ల ఆస్తిని అల్బేనియా నివాసి అయిన ఆమె కేర్‌టేకర్ కు చెందుతుంది.