బజార్‌ఘాట్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో 4 రోజుల పసికందు కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పుట్టిన నాలుగు రోజులకే పసికందు చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.