Homeఅంతర్జాతీయంఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతం

ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతం

– 11 మంది పర్వతారోహకుల మృతి

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో ఓ అగ్ని పర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైంది. ఆదివారం సుమత్రా దీవిలో మౌంట్‌ మరపిలో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.‘అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్లు మా వద్ద సమాచారం ఉంది. వారిలో 49 మందిని కాపాడాం. 11 మంది మరణించారు. మరో 12 మంది ఆచూకీ తెలియాల్సివుంది. కాపాడిన వారిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి’ అని పడాంగ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్‌ మాలిక్‌ తెలిపారు.

Recent

- Advertisment -spot_img