మహేశ్‌బాబు, రాజమౌళి కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘SSMB29′ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో మే-జూన్‌లో హైదరాబాద్‌లో భారీ సెట్‌లో 3వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లతో నీటిలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సాహస కథకు కీరవాణి సంగీతం, విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.