పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ అనే పాటని ఈ నెల 6వ తేదీ ఉదయం 9.06 గంటలకు రిలీజ్ చేయనున్నటు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది.