Homeహైదరాబాద్latest News'రాజా సాబ్' మూవీ నుండి అదిరిపోయే అప్డేట్.. మరోసారి ప్రభాస్ సరసన లేడీ సూపర్ స్టార్

‘రాజా సాబ్’ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్.. మరోసారి ప్రభాస్ సరసన లేడీ సూపర్ స్టార్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉందిని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంపికైందనే తెలుస్తోంది. ఇప్పటికే ఆ సాంగ్ కోసం నయనతారను సంప్రదించిన చిత్రబృందం ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ నడుస్తుంది. వీరిద్దరూ 2007లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘యోగి’ సినిమాలో కలిసి నటించారు. ప్రభాస్, నయనతార జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారనే వార్త వైరల్‌గా మారింది. ‘రాజాసాబ్’ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రపంచవ్యాపంగా ఏప్రిల్ 10న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img