Homeహైదరాబాద్latest News'స్పిరిట్‌' మూవీలో ప్రభాస్ పాత్రపై అదిరిపోయే అప్డేట్

‘స్పిరిట్‌’ మూవీలో ప్రభాస్ పాత్రపై అదిరిపోయే అప్డేట్

‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ మరియు ‘యానిమల్’ వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు సందీప్ వంగా… ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌ సినిమా తీస్తున్నాడు. ‘స్పిరిట్‌’లో క్రూరమైన పోలీసుగా కనిపించనున్న ప్రభాస్.. కండలు తిరిగిన రూపాన్ని సాధించడానికి కఠినమైన శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమాలో యానిమల్ కంటే ఎక్కువ యాక్షన్ డోస్ ఉంటుందని వంగా ధృవీకరించారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అనే పుకార్లు వస్తున్నాయి. ప్రభాస్ గతంలో బాహుబలి ఫ్రాంచైజీలో ద్విపాత్రాభినయం చేసినప్పటికీ, ఈ రెండు పాత్రలు తెరపై ఎప్పుడూ కలిసి కనిపించలేదు. ‘స్పిరిట్‌’లో ప్రభాస్ రెండు పాత్రలను ఒకసారి చూసే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రణబీర్ కపూర్ మరియు విజయ్ దేవరకొండల ప్రత్యేక అతిధి పాత్రల నటిస్తారు అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి,అయినప్పటికీ ఇవి అధికారికంగా ధృవీకరించబడలేదు.

Recent

- Advertisment -spot_img