ప్రముఖ పారిశ్రామికవేత్త రేఖా ఝున్‌ఝున్‌వాలా సోమవారం స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ.800 కోట్లు నష్టపోయారు. టాటా గ్రూప్ నేతృత్వంలోని టైటాన్ కంపెనీలో రేఖా ఝున్‌ఝున్‌వాలాకు 2024 మార్చి 31 నాటికి 5.35 శాతం షేర్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపుగా రూ.16,792 కోట్లు ఉంటుంది. సోమవారం (మే 6)న టైటాన్ కంపెనీ షేర్లు 7.02 శాతం మేర పతనం అయ్యాయి. రేఖా స్టాక్స్ వాల్యూ భారీగా పడిపోయింది. ఆమె సంపద రూ.15,986 కోట్లకు దిగజారింది. ఏకంగా ఒక్క రోజులోనే రూ. 805 కోట్లు నష్టపోయారు.
టైటాన్ కంపెనీ ఈ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో స్టాండ్అలోన్ నెట్ ప్రాఫిట్ 7 శాతం పెరిగి రూ.786 కోట్లకు చేరిందని నివేదించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ స్టాండ్అలోన్ నెట్ ప్రాఫిట్ రూ.734 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయాలు అనుకున్నంతగా పెరగలేదు. దీంతో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. ఫలితంగా సోమవారం రోజు బీఎస్ఈలో టైటాన్ కంపెనీ షేర్ వాల్యూ రూ.3,352.25 కనిష్ఠ స్థాయికి పడిపోయింది.