ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి గ్రామ వాసి లీడ్ ఇండియా ఉభయ రాష్ట్రల సమన్వయ కర్త,తాడూరి శ్రీనివాసచారి హైదరాబాద్ పెళ్లికి అతిథులుగా వెళ్లి నూతన వధూవరులకు వినూత్న పెళ్ళి కానుక అందజేశారు. హైదరాబాద్ లోని,విశ్రాంత ఎస్పీ తెలంగాణ సీఎం ఓఏస్డీ భద్రినాథ్ కుమారుని వివాహాని హాజరై నూతన వధువరులకు బహుమాన కానుకగా శ్రీ మధుభగథ్గీత పుస్తకం జాతీయ పతాకం అందజేశారు. రాష్ట్రంలో పలువురు ప్రముఖులు కానుక గురించి చర్చిస్తూ మెచ్చుకొన్నారు. కానుక పలు సోషల్ మీడియాల్లో (నెట్టింట్లో) వైరల్ అవుతుంది.