Homeహైదరాబాద్latest Newsఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం.. జగన్ ను ర్యాగింగ్ చేసిన రఘురామ రాజు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం.. జగన్ ను ర్యాగింగ్ చేసిన రఘురామ రాజు

ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జగన్ పై ప్రతిరోజు విమర్శలు గుప్పించే టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆయనతో మాట్లాడారు.. మాట్లాడారు అనడం కంటే ర్యాగింగ్ చేశాడు అని చెప్పవచ్చు. జగన్ అసెంబ్లీ ఆవరణలోకి వచ్చే సమయానికి.. అప్పటికే అక్కడ ఉన్న రఘురాజు.. ‘హాయ్ జగన్’ అని పలుకరించారు. జగన్ ముందుకు కదిలిన తర్వాత ఆయనతో పాటు వెళ్లి, ఆయన వరుసలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుందనగా.. లేచి వెళ్లి జగన్ పక్కన రఘురాజు కూర్చున్నారు. జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడారు. ప్రతి రోజు అసెంబ్లీకి రావాలని జగన్ ను సెటైరికల్ గా కోరాడు. ఇలా జగన్ ను అసెంబ్లీ ఒక ఆట ఆడుకున్నాడనే చెప్పాలి.

Recent

- Advertisment -spot_img