నిరుద్యోగులు, పురుషులను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారు. ఫేస్బుక్లో నకిలీ ఫ్రొఫైల్స్ను సృష్టించి అందమైన మహిళల ఫోటోలు పోస్ట్ చేస్తారు. 3 నెలల్లోపు వారిని గర్భవతిని చేస్తే.. రూ.20 లక్షల రివార్డు, ఆస్తి, కారు ఇస్తామని నమ్మిస్తారు. ఇందులో చేరాడానికి ముందుగా ప్రాసెసింగ్ ఫీజు కట్టించుకుని, ఆ తర్వాత వారితో కాంటాక్ట్ ఆపేస్తారు. ఈ కేసులో బీహార్ పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు.