ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పరిధిలోగల రాయపట్నం బ్రిడ్జి క్రింద గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయ్యింది. ఈ వ్యక్తి వయస్సు సుమారు 40 నుంచి 45 మధ్య ఉంటుంది. ఈ మృత దేహాన్ని జగిత్యాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో గల మార్చరీ గదిలో భద్రపరచడం జరిగింది. ఈ వ్యక్తి గురించి తెలిసినవారు ఉంటే ధర్మపురి పోలీస్ స్టేషన్ ను సంప్రదించగలరని ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపినారు. పి. ఉదయ్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ధర్మపురి. ఫోన్ నెంబర్- 8712656824.