పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఓజి’. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయినిగా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా విలన్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఒక స్టార్ నటిస్తున్నాడని అని టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక కి రోల్ నటిస్తున్నారు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అయితే ప్రభాస్ తో సుజిత్ గతంలో ‘సాహో’ అనే సినిమా చేసాడు. ఆ సినిమాకి ఓజి సినిమాకి కనెక్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వార్త విని పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ స్టార్ హీరోలు ఇద్దరు కలిసి థియేటర్లు కనిపిస్తే అభిమానులను ఒక పండుగ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుంది.