Homeహైదరాబాద్latest Newsపవర్ స్టార్ ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అప్డేట్.. 'ఓజీ' మూవీ ఇన్ యాక్షన్...

పవర్ స్టార్ ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అప్డేట్.. ‘ఓజీ’ మూవీ ఇన్ యాక్షన్ మోడ్

సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తిఅయింది.. కాకపోతే పవర్ స్టార్ రాజకీయాల్లో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ని మళ్ళి ప్రారంభించారు. ప్రస్తుతం ‘ఓజీ’ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది.
హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓజీకి సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే.. ఈ షూటింగ్ లో పవన్ ఇంకా జాయిన్ కాలేదు. ఈలోగా పవన్ లేని సన్నివేశాలను సుజీత్ పూర్తి చేస్తున్నాడు. షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఫోటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసారు .దీంతో ఓజీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img