Homeహైదరాబాద్latest Newsప్రభాస్ 'కల్కి' సినిమాపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

ప్రభాస్ ‘కల్కి’ సినిమాపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ సినిమాపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతుంది. సినిమాల్లో మన పురాణాలను వక్రీకరిస్తున్నారు అని అనంత శ్రీరామ్ ఆరోపించారు.’కల్కి’ సినిమాలో కర్ణుడి పాత్రను హైలైట్ చేయడం చూసి సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నా అని అనంత శ్రీరామ్ అన్నారు. ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమాలో కర్ణుడి పాత్రను అనవసర రీతిలో గొప్పగా చూపించారు అని ఆరోపించారు. పొరపాటును పొరపాటు అని చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో మనం పుట్టినట్టు కాదు అని అన్నారు. హిందూ ధర్మానికి కళంకం కలిగించేలా సినిమాలు వస్తున్నాయి అని.. సినీ రంగం తరపున క్షమాపణలు చెబుతున్నా అనంత శ్రీరామ్ అన్నారు.

Recent

- Advertisment -spot_img