అనన్య నాగళ్ళ లాంటి హీరోయిన్ కూడా ఇలా రెచ్చిపోతుందని ఎవరూ ఊహించలేదు. అభిమానులు కూడా ఇప్పుడు ఇదే షాక్ అవుతున్నారు.
కొన్ని రోజులుగా అదిరిపోయే అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది అనన్య.
ఇప్పుడు కూడా అమ్మడు అదిరిపోయే నడుము అందాలను బయటపెట్టింది.
అయినా కొంతమంది హీరోయిన్లకు కావాల్సినంత టాలెంట్ ఉంటుంది కానీ అదృష్టమే అరకొరగా ఉంటుంది.
అలాంటి హీరోయిన్ అనన్య నాగళ్ళ. ఈ అచ్చ తెలుగమ్మాయి ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటుంది.
ఈ మధ్యే వకీల్ సాబ్ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించింది అనన్య. ఆ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
అయితే అంజలి, నివేదా థామస్ లాంటి స్టార్స్ ముందు నిలబడలేకపోయింది అనన్య.
దానికి ముందు ప్లే బ్యాక్, మల్లేశం లాంటి సినిమాలు కూడా చేసింది ఈ బ్యూటీ.
తెలుగమ్మాయి కావడంతో అభినయం కూడా అర్థం చేసుకుని చేస్తుంది.
ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో కేవలం నటనను మాత్రమే నమ్ముకుంది.
అయితే వకీల్ సాబ్ తర్వాత ఈమె మనసు మార్చుకుంది.
ఇండస్ట్రీలో ఉండాలంటే కచ్చితంగా అందాలను ఆరబోయక తప్పదని అర్థం చేసుకున్నట్లుంది.
అందుకే మెల్లగా గ్లామర్ డోర్ ఓపెన్ చేస్తుంది అనన్య. రోజుకో విధంగా ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో వేడెక్కిస్తుంది అనన్య.
హీరోయిన్ గా ఒక ఇమేజ్ వచ్చిందని.. కాబట్టి దాన్ని నిలబెట్టుకోడానికి ఎక్స్ పోజింగ్ తప్పదని నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది.
అవసరం ఉన్నా లేకున్నా హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది.
ఈమె మైండ్ సెట్ మొదట్నుంచి ఇలాగే ఉందా లేదంటే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన తర్వాత ఇలా మారిపోయిందా అర్థం కావడం లేదు.
ఎందుకంటే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాకే ఈమె అవకాశాలు కూడా మొదలయ్యాయి.
ఇలాంటి సమయంలో తాను కూడా అందరిలాంటి అమ్మాయినే అంటూ అందాల ఆరబోతకు తెరతీయడం అర్థం లేని పని అవుతుందంటున్నారు విశ్లేషకులు.
కమర్షియల్ హీరోయిన్ లా మారిపోవాల్సిన అవసరం లేదంటున్నారు.
మల్లేశం సినిమాలో అనన్యను చూసినప్పుడు ఎంతో అమాయకంగా కనిపించింది.
వకీల్ సాబ్ సినిమాలోనూ అలాగే ఉంది. కానీ ఇప్పుడు ఫోటోషూట్స్ మాత్రం అలా లేవు. మరి ఎందుకు ఉన్న ఇమేజ్ పాడు చేసుకుంటుందో అర్థం కావడం లేదు.