Homeహైదరాబాద్latest NewsAnanya Nagalla : ఎలాంటి సీన్ అయినా నేను రెడీ

Ananya Nagalla : ఎలాంటి సీన్ అయినా నేను రెడీ

అచ్చతెలుగు అమ్మాయిలా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది అనన్య నాగళ్ల. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించింది. కానీ, ప్రస్తుతం రూటు మార్చింది. అందాల ఆరబోత, కిస్ సీన్లకు ఏమాత్రం వెనుకాడబోనంటోంది. ‘తంత్ర’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పాల్గొన్న అనన్య బోల్డ్ సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కెరీర్ ప్రారంభంలో రొమాంటిక్ సీన్లలో నటించనని చెప్పినా, ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు చెప్పింది. “తాను ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమాలో పెద్ద కిస్ సీన్ ఉంటుంది. ‘మల్లేశం’ సినిమా సమయంలో నేను ఇండస్ట్రీకి కొత్త. ఎలా చేసినా మనకు రోల్స్ వస్తాయి అనుకున్నాను. అయితే, నటనలో రొమాంటిక్ సీన్లు కూడా ఓ భాగం అని అర్థం చేసుకోవడానికి కొంచెం టైమ్ పట్టింది” అని అనన్య చెప్పుకొచ్చింది. అనన్య, వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

Recent

- Advertisment -spot_img