Homeహైదరాబాద్latest Newsఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాం.. అని అంటున్న అనన్య నాగళ్ల

ఆడ చేస్తాం ఈడ చేస్తాం యాడైన చేస్తాం.. అని అంటున్న అనన్య నాగళ్ల

టాలీవుడ్ యువ నటి అనన్య నాగళ్ల సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను ప్రయాణిస్తున్న విమానంలో ఆమె తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం వీడియోలో మనం చూడవచ్చు. చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన కొత్త సినిమా ‘పొటెల్’. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు వెరైటీగా ప్లాన్ చేసారు. ఇందులో భాగంగా చిత్ర బృందం వారు ప్రయాణిస్తున్న విమానంలో సినిమా ప్రమోషన్స్ చేశారు. విమానంలోని ప్రయాణికులకు పొట్టెల్ సినిమా పోస్టర్లను పంపిణీ చేశారు. దర్శకుడు సాహిత్, హీరో చంద్రకృష్ణ, హీరోయిన్ అనన్య నాగెళ్ల సినిమా తాలూకు పోస్టర్లను ప్రయాణికులకు పంపిణీ చేసి వారితో ముచ్చటించారు.ఈ ప్ర‌మోషన్స్‌ వీడియోను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img