పవన్ అభినందనలతో బుల్లితెర యాంకర్ అనసూయ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షల వెల్లువతో సోషల్ మీడియాలో అభిమానులు చేసిన హంగామా అందరికీ సంగతి తెలిసిందే. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యుల అభినందనలతో ఆయనపై ఉన్న అభిమానం చాటుకున్నారు. వీరిలోనే అనసూయ కూడా ఉంది.
అనసూయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘‘ఈ తరాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకరైన పవర్ స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే. మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నా సర్!!” అని అనసూయ ట్వీట్ చేసింది. ఇక ఆమె ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ స్పందించారు ‘‘ థాంక్యూ అనసూయ గారు. మీకు అంతా మంచే జరగాలి’’అంటూ ట్వీట్ చేశారు. దీంతో అనసూయ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.