పశ్చిమ బెంగాల్‌లో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకన్నా అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతాలోని దూరదర్శన్ టీవీ స్టూడియోలో లోపాముద్ర సిన్హా అనే యాంకర్ వార్తలు చదువుతూ స్పృహ కోల్పోయింది. ఎండలకు సంబంధించిన వార్తలు చదువుతూ కుర్చీలో వెనక్కి వాలిపోయింది. ఈ ఘటనపై ఫేస్‌బుక్‌లో ఆమె వివరణ ఇచ్చారు.